తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ క్రేజ్ కలిగిన డిస్ట్రిబ్యూటర్ , నిర్మాత అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇక పోతే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . అందులో భాగంగా ఈయనకు మీరు డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టారు . ఆ తరువాత నిర్మాతగా మారారు . మరి మీరు నిర్మాతగా కాకుండా కేవలం డిస్ట్రి బ్యూటర్ గా మాత్రమే సినీ పరిశ్రమలో కొనసాగి ఉండుంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో ఉండేవారా అనే ప్రశ్న ఎదురయింది.
దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... నిర్మాతగా కాకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కొనసాగి ఉండుంటే ఇన్ని సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో అసలు ఉండేవాడిని కాదు. ఉదాహరణకు ... నేను ఒక సంవత్సరం నిర్మించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ మూవీల ద్వారా నాకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఇక అదే సంవత్సరం నేను పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందున అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశాను.
ఇక ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆ రెండు మూవీల ద్వారా నాకు ఆ సంవత్సరం 25 కోట్ల నష్టం వచ్చింది. నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ను అయి ఉంటే అప్పుడే నా కెరియర్ క్లోజ్ అయ్యేది. కానీ నేను నిర్మాతగా సంపాదించిన డబ్బుల నుండి ఆటో సెటిల్ చేశాను. అలా డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాత గా కొనసాగుతున్నాను కాబట్టే నేను ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.