హిందీలో చరణ్ కు అంతా క్రేజ్ ఉందా.. ఒక్క దెబ్బతో స్టామినాను నిరూపించుకున్నాడు..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రా మచ్చా అంటూ సాగే రెండవ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో మూవీ బృందం వారు విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలోని రా మచ్చా హిందీ వర్షన్ లిరికల్ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికే రా మచ్చా హిందీ వర్షన్ సాంగ్ కి యూట్యూబ్ లో 18 మిలియన్ వ్యూస్ , 109 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి హిందీ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ సాంగ్ కి హిందీ ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీ పై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ హిందీ ఏరియాలో ఏ స్థాయి సక్సెస్ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: