ఏంటి, ఇంకా పుష్ప-2 షూటింగ్ అవ్వలేదా.. ముంచేలా ఉన్నాడే..?

Suma Kallamadi


కొన్ని అనుకోని కారణాల వల్ల హైలి యాంటిసిపేటెడ్ మూవీ "పుష్ప 2: ది రూల్" షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులోని హీరో అల్లు అర్జున్ తన గడ్డం తొలగించడం, కొన్ని లాజిస్టిక్ సమస్యలు వంటి కారణాల వల్ల చిత్రీకరణ కొన్నిసార్లు నిలిచిపోయింది. అయితే, ఈ రోజు నుంచి (అక్టోబర్ 3) కొత్త షెడ్యూల్ మొదలైంది.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు సుకుమార్ "పుష్ప రాజ్" పాత్ర కోసం చాలా కాలం నుండి కష్టపడుతున్నారు. ముఖ్యంగా, చిత్రానికి ఒక బలమైన ముగింపును ఎలా ఇవ్వాలనే విషయంలో వారిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి. అంతేకాకుండా, ఈ చిత్రం "పుష్ప 3" కి ఒక మంచి నేపథ్యం కూడా అందించాలి.

పుష్ప 2 సినిమాకి ఎలాంటి క్లైమాక్స్ ఉండాలి అనే విషయంలో దర్శకుడు సుకుమార్ కొత్త ఆలోచన చేశారు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ రెండుసార్లు మార్చారు. కానీ ఇప్పుడు మూడోసారి కొత్త క్లైమాక్స్ రూపొందిస్తున్నారు. ఈ కొత్త ఆలోచన సుకుమార్‌కి, హీరో అల్లు అర్జున్‌కి చాలా బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు వాళ్ళు సినిమా షూటింగ్‌ని చాలా ఎనర్జీతో చేస్తున్నారు. దాదాపు 10 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఈ సమయంలో దానిని కంప్లీట్ చేసి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి ఉంటుంది. 2021లో పుష్ప సినిమా వచ్చింది 2024 పూర్తవుతున్న సరే ఇంకా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. 

 మూడోసారి చేస్తున్న క్లైమాక్స్ బాగుంటుందా లేదా అనే సందేహం కూడా వారిలో మొదలయ్యింది మొదటగా అనుకున్న క్లైమాక్స్ ఎందుకు స్క్రాప్ చేశారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ థర్డ్ క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చకపోతే ఫస్ట్ క్లైమాక్స్ సెకండ్ క్లైమాక్స్ కూడా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. కానీ అలా జరిగే అవకాశం ఉండదు. 

పుష్ప సినిమాకి ప్రేక్షకులు బాగా ఆదరించారు. అందుకే పుష్ప 2 సినిమాతో ఇంకా ఎక్కువ వసూళ్లు చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. వాళ్ళ లక్ష్యం ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేయడం. అయినా కూడా సినిమా రిలీజ్ డేట్ మారుస్తున్నారనే వార్తలు వస్తున్నా, డిసెంబర్ 6న సినిమా విడుదల అవుతుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: