తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా చాలా సంవత్సరాలుగా కెరీర్ ను కొనసాగించిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ఈ నలుగురితోనూ బి గోపాల్ సినిమాలను తెరకెక్కించాడు. కానీ ఇందులో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లకు ఈ దర్శకుడు భారీ బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించగా ... నాగార్జున కు మాత్రం పెద్ద స్థాయి విజయాలను అందించలేకపోయాడు.
నాగార్జున , బి గోపాల్ కాంబోలో మొదటగా కలెక్టర్ గారి అబ్బాయి అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో విజయ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇకపోతే నాగార్జున ఓ సినిమా యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడట. ఇక ఆ సినిమాను బి గోపాల్ దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని ఆలోచనతో నాగార్జున నేను ఒక సినిమా కొనుగోలు చేశాను.
దానిని మీరు రీమిక్ చేయండి అని అడిగాడట. కానీ అప్పటికే ఆయన ఇతర కమిట్మెంట్లతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడట. దానితో ఈ వీ వీ సత్యనారాయణ ఆ సినిమాను నాగార్జున తో రీమిక్ చేశారట. ఆ సినిమానే వారసుడు అని బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు. ఇకపోతే నాగార్జున హీరోగా ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన వారసుడు సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.