రివ్యూ: శ్వాగ్ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్ కొట్టారా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి.. కానీ కామెడీ సినిమాలకు హీరో శ్రీ విష్ణు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఓం బీమ్ బుష్ తర్వాత..తాజాగా ఈ రోజున శ్వాగ్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల  ముందుకు వచ్చారు. ఈ సినిమానీ రాజరాజచోర వంటి సినిమాతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా విష్ణు కెరియర్ కి సక్సెస్ అందించిందా లేదా అనే విషయం ఇప్పుడు చూద్దాం.

శ్వాగ్ చిత్రంలో శ్రీ విష్ణు నాలుగు విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించారట.. ఇందులో సింగా క్యారెక్టర్ కూడా హేలియరేస్ గా ఉందని టాక్ వినిపిస్తున్నది.. మిగిలిన మూడు క్యారెక్టర్లు కూడా మరింత అద్భుతంగా శ్రీ విష్ణు నటించినట్లు నెటిజన్స్ తెలియజేస్తున్నారు. శ్రీ విష్ణు తన సిని కెరియర్ లోనే శ్వాగ్ సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ అని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ సినిమా అన్నట్లుగా మరొక నేటిజన్ తెలియజేస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఇంటర్వెల్ వరకు చాలా సరదాగే సాగిపోగుతుందని.. ఇంటర్వెల్లులో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని అది అందరిని ఆశ్చర్యపరుస్తుందంటూ మరొక నెటిజన్ తెలియజేస్తున్నారు.
సెకండాఫ్ కామెడీ కంటే శ్రీ విష్ణు నటనే హైలెట్గా నిలిచిందని వన్ మ్యాన్ షో అన్నట్లుగా మరొక నెటీజన్ తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి శ్వాగ్ సినిమా రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ హసిత్ గోలి మంచి సందేశం ఇచ్చారని మరి కొంతమంది నేటిజన్స్ తెలియజేస్తున్నారు. మీరాజాస్మిన్ చాలా కీలకమైన పాత్రలో నటించింది అని తెలుగు ప్రేక్షకులకు ఒక న్యూ ఏజ్ సినిమా ఇచ్చారని డైరెక్టర్ ని పొగిడేస్తున్నారు. అలాగే రీతు వర్మ కి కూడా మంచి పాట్రాట్ దొరికిందని  ఎవరికి వారు తమ పాత్రలలో జీవించి పోయేలా నటించారంటూ తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా అంతా పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తోంది మరి పూర్తి రివ్యూ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: