అప్పుడేమో సాఫ్ట్ గా.. ఇప్పుడేమో గుర్రుగా ఏందయ్యా ఎన్టీఆర్ ఇది..!!
* అత్త ఆ విషయంలో ఆ ఫైర్ ఏమైందంటూ అభిమానులు ఆగ్రహం
* అక్కినేని ఫ్యామిలీ పైనే ఎందుకంత ప్రేమ..
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు నాగార్జున ఘాటుగానే స్పందించారు.. అంతే కాదు కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేశారు..హీరోయిన్ సమంత సైతం రాజకీయాలలోకి నన్ను లాగొద్దు.. నా విడాకుల విషయం పూర్తిగా నా వ్యక్తిగతం దానిలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు..కేటిఆర్ ని విమర్శించే నేపథ్యంలో తమ పేరు తీసుకురావడం జరిగింది.. మిమ్మల్ని ఇబ్బంది కలిగించి ఉంటే నా వ్యాఖ్యలు వెనక్కుతీసుకుంటున్నా అని తెలిపారు.. అయితే ఈ ఇష్యూ పై టాలీవుడ్ ప్రముఖులు కాస్త ఘాటుగానే స్పందించారు.. ఈ విషయంలో ముందుగా స్పందించిన స్టార్ హీరో ఎన్టీఆర్.. అక్కినేని కుటుంబం తనకి చాలా దగ్గరి కుటుంబం కావడం అలాగే సమంతతో ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ ఉండటంతో ఎన్టీఆర్ కొంచెం ఘాటుగానే స్పందించారు..మంత్రి కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికాడు.. ఎన్టీఆర్ రెస్పాన్స్ వచ్చిన తరువాత టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా స్పందించడం మొదలు పెట్టారు..అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇదే విషయంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తీరుపై మాత్రం కొందరు నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలే..