కొండ సురేఖ కామెంట్స్ పై.. సినీ పరిశ్రమ పోరాటం.. కానీ అంత సోషల్ మీడియాలోనే?

praveen
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేయాలి అని ఉద్దేశంతో.. అక్కినేని ఫ్యామిలీని మధ్యలోకి లాగింది కొండ సురేఖ. నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని తెరమీదికి  తీసుకువస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపియాలని కేటీఆర్ కోరాడని.. అయితే నాగార్జున, నాగచైతన్య ఈ ఈ విషయం గురించి సమంత పై ఒత్తిడితీసుకువచ్చారంటూ కామెంట్ చేసింది.

 కానీ సమంత ఒప్పుకోకపోవడంతోనే చివరికి నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని.. ఇలా నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయ్. అయితే కొండ సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నటీనటులు అందరూ కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అక్కినేని కుటుంబానికి సారీ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా సినిమా పరిశ్రమపై ఎవరైనా విమర్శలు చేస్తే తాము ఒక్కటే పోరాటం చేస్తాము అంటూ చెబుతున్నారు.

 అయితే ఇలా పోరాటం చేయడం వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ పోరాటం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎంతోమంది హీరో హీరోయిన్లు నటీనటులు అటు సోషల్ మీడియాలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు.కానీ ఆ తర్వాత ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ కలిసికట్టుగా ఎక్కడ ఫిర్యాదు చేయడం కానీ.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడటం కానీ ఎక్కడ జరగలేదు. ఇలా ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య వచ్చిన తాము అండగా నిలబడతామని సోషల్ మీడియా ద్వారా చెబుతున్న సెలబ్రిటీలు అటు.. దానిని కార్యాచరణ విషయంలో రుజువు చేయడంలో మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇక ఎప్పుడూ ఇలాంటి పరిస్థితె కొనసాగుతూ వస్తుంది అని ఇక ఇదంతా చూస్తున్న జనాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: