వారి నుంచి మోక్షజ్ఞకు బిగ్ సవాల్.. తొలి సినిమాతోనే డేంజర్ లో పడ్డాడుగా..!

Amruth kumar
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందన్న క్లారిటీ అయితే వచ్చేసింది..  క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది . అయితే ఇదే సమయంలో మొదటి సినిమాతో నే మోక్షజ్ఞకు ఊహించని సవాలు ఎదురవుతున్నాయని కూడా చెప్పొచ్చు.  మోక్షజ్ఞ తొలి మూవీ ఏకంగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది . అయితే మోక్షు తనకు ఎదురయ్యే సవాలను అధిగమించడం కూడా సులువు .. ఇదే క్రమంలో ఆయనకు ఇబ్బందులు కూడా వస్తాయ నే కామెంట్లు కూడా వస్తున్నాయి .
మోక్షజ్ఞ కు స్టార్ స్టేటస్ రావాలంటే ఇప్పటి కే పాన్ ఇండియా స్టేటస్ ను అందుకున్న హీరోలతో సమానంగా మార్కెట్ ను పెంచుకోవాల్సి ఉంటుంది . మోక్షజ్ఞ యాక్టింగ్ లో సైతం ఇతర హీరోలకు దీటుగా మెప్పించ గలన ని నిరూపించుకోవాలి. అయితే కొడుకు ఫస్ట్ మూవీలో బాలయ్య సైతం ప్రత్యేక పాత్రలో నటించడం సినిమాకు ఎంతగానో ప్లస్ అవుద్ది.. అలాగే మోక్షజ్ఞ తన తొలి సినిమాకు రూ. 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో మీడియాకు సైతం మోక్షజ్ఞ దూరంగా ఉండటం పై భిన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
మోక్షజ్ఞ లుక్స్ విషయంలో ఆయనకి మంచి మార్కులు పడుతున్నాయి . మోక్షజ్ఞ ను ఇతర భాషల ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. మోక్షజ్ఞ ఎవ‌రు ఉహించ‌ని ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుంద ని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ ఏ విధంగా ఉంటుంద నే చర్చ సైతం జరుగుతోంది. మోక్షజ్ఞ ఇప్పటి కే యాక్టింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞ కథల ఎంపిక సైతం ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా ఉండటం గమనార్హం. బాలయ్య కొడుకు కావడం మోక్షజ్ఞకు ఎంతగానో ప్లస్ అవుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: