అక్కినేని ఫ్యామిలీకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ శాపం కారణంగానేనా..!?
ఇక అక్కినేని నాగేశ్వరరావు విషయానికి వస్తే ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగాడు నాగేశ్వరరావు. దాదాపు 300లకు పైగా సినిమాలో నటించాడు. ఎన్టీఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు , భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను నాగేశ్వరావు అందుకున్నారు.
ఆయన మాత్రమే కాకుండా ఆయన కుటుంబం నుంచి కూడా ఆయన కుమారులు మనవళ్లు మనవరాలు కూడా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున హీరోగా నిర్మాత కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.
మరో కుమారుడు వెంకట్ సైతం బిజినెస్ లు, సినిమాలలో కూడా చూసుకుంటాడు. ఇక నాగచైతన్య , అఖిల్ సైతం హీరోలుగా రాణిస్తున్నారు . ఇదంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ వరస వివాదాల్లో నిలుస్తూ హట్ టాపిక్‌గా మారుతుంది. ప్రధానంగా అక్కినేని హీరోల పెళ్లిళ్ల వ్యవహారం కేవలం మూడునాళ్ల ముచ్చటగానే అవుతుండటం అందరికీ అనేక అనుమానాలు కలిగిస్తుంది. నాగార్జున రెండో పెళ్లి , చైతన్య కూడా అదే బాటలో అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక పెళ్లి తంతు ఆగిపోయింది. చైతు కూడా ముందు సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు వచ్చి ఇప్పుడు శోభితతో ఏడు అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు. మరో అక్కినేని హీరో సుమంత్ పరిస్థితి కూడా అంతే.. ఇలా ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు విషయంలో రెండో స్టెప్ తీసుకున్నారు. తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణామన్ని చెప్పి ప్రభుత్వం కూల్చేసింది. ఇక నిన్నటి నుండి అక్కినేని ఫ్యామిలీ ఫై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలా వరుస వివాదాలు , ఆరోపణలు అక్కినేని ఫ్యామిలీ ని వెంటాడుతుండడంతో అభిమానులు కలవరపడుతున్నారు. ఎందుకు అక్కినేని ఫ్యామిలీ కే ఇలా జరుగుతుంది..? ఏమైనా దుషలు ఉన్నాయా..? అని మాట్లాడుకుంటున్నారు.