సెలబ్రిటీ వివాదాల్లో బాధితులు అమ్మాయిలే... ఎందుకిలా అంటే...!
ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక మూల రేణు దేశాయ్ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. పవన్ పై తమకున్న అభిమానాన్ని ఒక్కోసారి ఇలా పరాకాష్టతో చూపిస్తూ ఉంటారు అభిమానులు. తాజాగా ఈ బాధితులు జాబితాలోకి చేరింది తమిళ హీరో జయం రవి భార్య ఆర్తి. జయం రవి.. తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడో లేదో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. అయితే రవి అభిమానులు ఆమె ఎంత సైలెంట్ గా ఉన్న పదేపదే రెచ్చగొడుతూ ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెను వదిలిపెట్టలేదు. హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయిన వెంటనే తప్పంతా ఐశ్వర్యదే అన్నట్టుగా ఆమెపై విరుచుకుపడ్డారు.
చివరకు మెగా కాంపౌండ్ కు చెందిన నిహారిక కూడా ఈ విషయంలో బాధితురాలుగా మిగిలింది. జొన్నలగడ్డ చైతన్య నుంచి విడిపోయినప్పుడు నిహారిక పై సోషల్ మీడియాలో చాలా పోస్టులు వచ్చాయి. తప్పంతా నిహారికదే అన్నట్టు కొంతమంది విమర్శలు చేశారు. ఇక జీవి ప్రకాష్ కూడా సైంధవి నుంచి విడిపోయినప్పుడు ప్రకాష్ మామూలుగా ఉన్నా.. సైంధవి ఎన్నో అవమానాలకు గురయింది. అభిషేక్ బచ్చన్ .. ఐశ్వర్యరాయ్ కలిసి ఉన్న కూడా ఐశ్వర్యదే తప్పు.. విడిపోతున్నారు అంటూ టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నయనతార, శింబు ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని విడిపోయినప్పుడు కూడా అందరూ నయనతారనే టార్గెట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా పరిశ్రమలు చాలామంది కనిపిస్తారు. కానీ.. ఇద్దరు విడిపోయినప్పుడు ఎక్కువ టార్గెట్ అమ్మాయిల వైపే కనిపిస్తోంది అన్నది వాస్తవం.