ఆ హీరోయిన్ ని అందరి ముందే అంత మాట అనేసినా ఎన్టీఆర్.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

Amruth kumar
 లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తెలుగులో లక్ష్మీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో జంటగా నటించి స్టార్ డం తెచ్చుకుంది. అదే విధంగా తన అందం, అభియ‌నంతో ప్రేక్షకుల్లో కూడా ముంచి  గుర్తింపు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ. ఒక టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే వరుస  స్టార్ హీరోలతో సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా మారింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే కోలీవుడ్ డైరెక్టర్విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అలాగే స్వరోగ‌సి ద్వారా ఇద్దరి పిల్లలకు తల్లి కూడా అయింది. ఇలా ఒక పక్క సినిమాలు మరో పక్క తన ఫ్యామిలీతో ఎంతో బీజికా గడుపుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో నయనతార ఎన్నో సూపర్ హిట్ సినిమాతో న‌టించింది అయితే ఆమే ప్రేక్షకులకు బాగా దగ్గరైన మూవీ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఎన్టీఆర్, నయనతార, షీలా, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తనపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తాడంటూ నయనతార ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకు వచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. "షూటింగ్ సమయంలో నేను మాటిమాటికీ టచప్ చేయించుకుంటున్నాను. అలా టచప్ చేసుకుంటూ లిప్‌స్టిక్ రాసుకుంటూ ఉంటే.. తారక్ పక్కనే నిలబడి అలాగే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు అని తారక్‌ని అడిగితే.. ఎందుకు అంతగా మేకప్ వేసుకుంటున్నావ్ అని అడిగాడు. అప్పుడు నేను.. షాట్‌లో అందంగా కనిపించాలి కదా అని సమాధానం ఇచ్చాను. దీంతో తారక్ నువ్వెంత మేకప్ చేసుకున్నా జనాలు నిన్ను చూడరు. నన్నే చూస్తారు అని అన్నాడు. అది విని నాతో పాటు సెట్‌లో ఉన్నవారు సరదాగా నవ్వుకున్నారు. మరి మన చారీ లుక్, గెటప్ అలాంటిది కదా" అంటూ నయన్ నవ్వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: