చంద్రబాబు గురించి తెలీక.. తారక్ పై ఆ జోక్ వేసిన కపిల్ శర్మ.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే?
అయితే గతంలో అటు వైసిపి టిడిపిని ఇబ్బంది పెట్టిన సమయంలో సైతం తారక్ సైలెంట్ గానే ఉండడం చూసి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనేది కేవలం పుకార్లు మాత్రమే కాదు నిజమే అన్న విషయం అందరికీ అర్థమైంది. అది సరేగాని ఇప్పుడు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఎందుకు అని అనుకుంటున్నారు కదా. ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫేమస్ అయిన కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. అయితే ఈ షోలో ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఒక్కసారిగా ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురించి తారక్ ను ఒక ప్రశ్న అడగడమే కాదు జోక్ కూడా వేసాడు కపిల్ శర్మ.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు దగ్గర బంధువంట కదా అని అడిగారు కపిల్. దానికి తారక్ అవును అంటూ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కపిల్ వారి బంధం మీద జోక్ కూడా వేశాడు. మీ దగ్గరకు రచయిత వచ్చి కథ చెప్పాక నచ్చకపోతే.. ఆయన నో చెబుతారు కదా. ఆ రచయిత నాదొక కాంట్రాక్ట్ ఉంది కాస్త సీఎం తో మాట్లాడుతారా అని అడిగితే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. అయితే ఇది జోక్ గా అడిగినప్పటికీ.. తారక కాస్త ఇబ్బంది పడి కేవలం తల ఊపి సమాధానం చెప్పకుండానే ఊరుకున్నాడు. ఎందుకంటే ఆ విషయంపై ఏదైనా సమాధానం చెబితే అది ఏ వైపుకు దారితీస్తుందో అని తారక్ కామ్ గా ఉన్నట్లు అర్థమవుతుంది.