చిరంజీవి సినీ కెరీర్ ను తలకిందులు చేసిన ఆచార్య.. తండ్రి కొడుకుల కాంబో కలిసి రాలేదా.?
- మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ డిజాస్టర్..
- ఆచార్య సినిమా చూసి షాక్ అయినా మెగా అభిమానులు...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ ఇందులో చాలామంది ఏదో ఒక సినీ బ్యాగ్రౌండ్ ద్వారానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ చిరంజీవి మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా మారారు. మరి ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఏదో అడపా దడపా పనులు చేయలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనలోని నటనా టాలెంట్ ను మరింత హైలెట్ చేసుకుంటూ ముందుకు కదిలాడు. ఆ విధంగా ఎంతో టాలెంట్ ఉంది కాబట్టే తెలుగు ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి కెరియర్లో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఈయన కెరియర్ లో ఫ్లాప్స్ కంటే ఎక్కువ హిట్సే ఉన్నాయి. అలాంటి చిరంజీవి కెరియర్లో అద్భుతమైన హిట్ ఇచ్చి మలుపు తిప్పిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ కెరియర్లో చెప్పుకోదగ్గ ఫ్లాప్స్ కూడా అనేకం ఉన్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం
ఫ్లాప్ మూవీస్:
మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నాళ్లపాటు నడిపించిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. అలా సినిమాల్లో రాజకీయాల్లో ఏకధాటిగా రాణించిన హీరోగా చిరంజీవికి మంచి గుర్తింపు ఉంది. అలాంటి చిరంజీవి ఏడుపదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ ఇప్పటికీ యువ హీరోల్లా డాన్సులు యాక్టింగ్ లో అదరగొడతారు.. అలా చిరంజీవి కెరియర్లో అత్యంత ఫ్లాప్ ఇచ్చిన చిత్రాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి కెరియర్ స్టార్టింగ్ లో అత్యంత ఫ్లాప్ ఇచ్చిన మూవీ యుద్ధభూమి, దీని తర్వాత రుద్రనేత్ర,లంకేశ్వరుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, రాజా విక్రమార్క, ఎస్పీ పరశురామ్, బిగ్ బాస్, మృగరాజు,రిక్షావోడు, అంజి, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాలు తన కెరియర్ మొదట్లో దారుణంగా ఫ్లాప్ ఇచ్చాయి.