ఆ హీరో.. అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలనుకున్నాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?

praveen
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో హీరోయిన్లు బలి అవుతున్నారా.. అసలు హీరోయిన్లకి ఎక్కడ రక్షణ ఉండదా అనే ప్రశ్నలు ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అటు హీరోయిన్లు మాత్రం ఇలాంటి వాటి గురించి బయటకు చెప్పేవారు కాదు. ఎందుకంటే ఎక్కడ ఈ విషయాలు చెబితే తమ కెరియర్ పాడవుతుందో అని భయపడి పోయేవారు. కానీ నేటి ఆధునిక యుగంలో మాత్రం సోషల్ మీడియా అందరికీ చేరువ కావడంతో ఇక తమ పర్సనల్ విషయాలను కూడా చెప్పేందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు.

 ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమ కెరియర్ లో ఏదైనా చేదు అనుభవాల గురించి సోషల్ మీడియాలో నిజాలు బయట పెట్టడం.. ఎన్నో సార్లు సంచలనంగా మారిపోయింది. ఒక్కొక్కరుగా ఈ విషయంపై ఓపెన్ అవుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక అయితే మరింత ప్రకంపనలు సృష్టించింది. ఇక ఎప్పుడూ మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె ఎవరో కాదు నటి మల్లికా శెరావత్.

 ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక హీరో తనతో అనుచితంగా ప్రవర్తించిన తీరును ఇటీవల చెప్పుకొచ్చింది ఆమె. ఒకసారి నేను ఒక పెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాను. నేను అందులో కామెడీ రోల్ పోషించా. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఓ రోజు 12 సమయంలో అర్ధరాత్రి ఓ స్టార్ హీరో నా రూమ్ లోకి రావాలని ప్రయత్నించాడు. తాను డోర్ తీయకపోవడంతో బద్దలు కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎంతగానో భయపడిపోయాను. ఇక ఆ తర్వాత అతనితో ఎప్పుడు కలిసి నటించలేదు అంటూ మల్లికా శెరావత్ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: