ఓజి ఇండస్ట్రీ హిట్ గ్యారెంటీ.. కానీ ఆ ముప్పు తప్పేలా లేదే..!?

Anilkumar
పవన్‌ కళ్యాణ్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'. ప్రభాస్ తో భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ గా 'సాహో' సినిమాను రూపొందించిన దర్శకుడు సుజీత్‌ 'ఓజీ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. మాఫియా నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ను విభిన్నమైన పాత్ర లో చూపిస్తూ సాహో సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఓజీ పవన్‌ బిజీగా ఉండటం వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే

 నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈనెల ఆరంభంలో పవన్‌ ఓజీ సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉన్నా ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా రద్దు అయింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కళ్యాణ్ వరదల సమయంలో బిజీ బిజీగా ఉన్నారు. పరిస్థితులు కుదుట పడ్డ నేపథ్యంలో ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో ఓజీ కోసం పవన్‌ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.  అయితే ఓజీ సంగీత దర్శకుడు అయిన థమన్‌ ను చాలా మంది అప్‌డేట్‌ ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు థమన్‌ నుంచి ఓజీ కి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఆయన ఒక ఒక పోస్ట్ లో ఓజీ

 కచ్చితంగా ఇండస్ట్రీ హిట్‌ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. థమన్‌ సోషల్ మీడియాలో  స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా ప్రతి ఒక్కరికీ ఓజీ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఉంది. సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరు మెచ్చే విధంగా ఉంటుంది. దర్శకుడు సుజీత్‌ అద్భుతంగా ఓజీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం బిగ్‌ అప్డేట్‌ ఇవ్వడం కోసం వర్క్‌ చేస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కోసం ఓజీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వస్తుంది అనే నమ్మకంను థమన్‌ చేశారు. అంతే కాకుండా ఓజీ సినిమా విడుదల తేదీ విషయంలోనూ అతి త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన మాటల ద్వారా అర్థం అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: