మ్యాన్ ఆఫ్ మాసెస్
ఎన్టీఆర్ లేటెస్ట్
మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు
కొరటాల శివ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో
ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి అభిమానులు విజిల్స్ వేస్తూ థియేటర్లలో
రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పాన్
ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘దేవర’కు మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కాగా ఈ సినిమాకు
ఎన్టీఆర్ అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. దీంతో ఇతర భాషల అభిమానులు
ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి, ఆయనకు భాషపై ఉన్న పట్టుని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక
హీరో ఇన్ని
భాషల్లో సొంతంగా డైలాగ్ చెప్పి మెప్పించడం నిజంగా గ్రేట్ అని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. హిందీలో 'వార్ 2'
మూవీ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది.
హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో
తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 'దేవర' తో నార్త్
ఇండియన్ ఆడియన్స్ కి
తారక్ బాగా రీచ్ అయ్యాడు. 'వార్ 2' మూవీతో కచ్చితంగా
బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ని
ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. 'వార్ 2'
మూవీ 2025లో థియేటర్స్ లోకి రానుంది. ప్రశాంత్
నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీని
తారక్ ఇప్పటికే స్టార్ట్ చేశాడు. ఈ
సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు కావొచ్చని టాక్. 2026 జనవరికి ఈ
మూవీ థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత మరల
కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర పార్ట్ 2' రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని
తారక్ 2025 ఆఖరులో స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. దీని తర్వాత
ఎన్టీఆర్ లైన్ అప్ లో జైలర్ ఫేమ్ నెల్సన్
దిలీప్ ఉన్నారు. మరి
జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాతో ఎప్పుడు వస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది..!!