ఆరోజు ఇండస్ట్రీ విషయంలో అలా.. ఈరోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందిగా నాగార్జున..!

Amruth kumar
తెలంగాణ మంత్రి కొండా సురేఖతో వివాదం నడుస్తున్న వేళ అక్కినేని నాగార్జున మరోసారి సోషల్ మీడియాలో సంచలనం వ్యాఖ్యలు చేశారు. నాగార్జున నేను ఎప్పుడూ బలమైన వ్యక్తిని.. తన‌ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నేను సింహాన్ని.. క్లిష్ట సమయంలో మాకు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో అండగా నిలబడింది. ఇదంతా మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ నాగార్జున సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబమంతా ఒక తాట పైకి వచ్చింది.. అలానే మొట్ట మొదటిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఒక తాటిపైకి వచ్చి కొండా సురేఖ కామెంట్స్ ని ఖండించారు. కొందరైతే ఆమెపై విరుచుకుపడ్డారు కూడా.. ఆదే విదంగా ఈ విషయంపై కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా కూడా వేశారు.

అయితే ఇక్కడ నాగార్జునకు చిత్ర పరిశ్రమ మొత్తం అండగా నిలబడటం ఆహ్వానించ‌ దగ్గ విషయమే.. అయితే ఇదే నాగార్జున గతంలో ఒకసారి తెలుగు చిత్ర పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన కొన్ని కామెంట్లను నెటిజన్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గత వైసిపి గవర్నమెంట్ తెలుగు చిత్ర పరిశ్రమను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలిసింది. మరియు ముఖ్యంగా టికెట్లు ధరల విషయంలో ఎంతో దారుణంగా ప్రవర్తించి.. సామాన్యుడికి వినోదం అందాలంటూ నానా రచ్చ చేశారు. అదే సమయంలో నాగార్జున సినిమా నా స్వామి రంగా రిలీజ్ సమయంలో.. ఓ ప్రెస్ మీట్ లో భాగంగా టికెట్లు ధరలతో మీకు ఇబ్బంది లేదా? అంటే నాకేం ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఆ టిక్కెట్ల ధరలు ఓకే అంటూ ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పడుతున్న సమయంలో నా దారి నాదే అనేలా స్పందించారు. ఇప్పుడు ఇదే వీడియోని నెటిజ‌న్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అంతేకాకుండా కుటుంబం అంటే మీ సొంత ఇంట్లో ఉండే వారే కాదు.. అసలు కుటుంబం అంటే మీకు నేమ్ ఫేమ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ కూడ ఇప్పుడు మీకు కష్టం వస్తే ఆ ఇండస్ట్రీ నే నీ వెనుక సపోర్టుగా నిలబడింది. అదే ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ సమయంలో మీరు నిజంగా సింహంలా నిలబడి ఉంటే.. ఈరోజు మీరు ఈ మెసేజ్ కూడా పెట్టాల్సిన పని వచ్చేది కాదు. ఏదేమైనా అక్కినేని నాగేశ్వరరావు అన్నా ఆయన కుటుంబం అన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక పిల్లర్.. మీరు ఇండస్ట్రీని వదులుకున్న.. టాలీవుడ్ మిమ్మల్ని వదులుకోదు. ఇకనైనా ఇండస్ట్రీ తో కలిసి వెళ్ళండి నాగార్జున గారు అంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన పెట్టిన పోస్ట్ కు కామెంట్లు పెడుతూ ఆయనకు సూచనలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: