టాప్ హీరో స్టేటస్ పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రస్తుత తరం టాప్ హీరోలు మహేష్ ప్రభాస్ జూనియర్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య పోటీ విపరీతంగా ఉంది. ఈ ఐదుగురు క్రేజీ హీరోలలో ఎవరు టాప్ నెంబర్ వన్ స్థానంలోకి వెళతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఐదుగురు యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉండటంతో అభిమానుల మధ్య కూడ వార్ తారా స్థాయిలో నడుస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు టాప్ హీరో స్టేటస్ పై చేసిన కొన్ని ఆశక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాప్ హీరో స్టేటస్ అన్నది శాశ్వితంగా ఎవరికీ ఉండదనీ వారు నటించే సినిమాలు హిట్స్ రేంజ్ కలక్షన్స్ రేంజ్ ని బట్టి ఈ స్టేటస్ మారిపోతూ ఉంటుందని సురేష్ బాబు అభిప్రాయపడుతున్నారు.

గతంలో చిరంజీవి టాప్ హీరో స్టేటస్ కొనసాగించినట్లుగా ఇప్పటి తరం హీరోలకు కుదురదనీ ప్రేక్షకుల అభిరుచితో పాటు సినిమాలకు జరిగే బిజినెస్ ను బట్టి టాప్ హీరోల రేంజ్ లెక్కకడుతున్నారని అయితే ఇప్పుడు హీరోల స్టేటస్ స్థానాలు ఏమాత్రం శాశ్వితమగా ఉండకుండా సినిమా సినిమాకు మారిపోతున్నాయి అంటూ ఈప్రముఖ నిర్మాత అభిప్రాయ పడుతున్నాడు.  

ప్రస్తుతతరం హీరోలలో అభిమానుల విషయంలో సినిమాలలో నటించినా నటించకపోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతూనే ఉందని సినిమాల హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అతడి మ్యానియా కొనసాగుతోందని అంటూ ఈ నిర్మాత చేసిన కామెంట్స్ పవన్ మ్యానియాను సూచిస్తున్నాయి. అభిమానుల క్రేజ్ విషయంలో సినిమాల హిట్స్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ మ్యానియా కూడ బాగుంది అని ఈ ప్రముఖ నిర్మాత చేసిన కామెంట్స్ డార్లింగ్ అభిమానులకు జోష్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ను సాసిస్తున్న టాప్ హీరోల స్టేటస్ పై సురేష్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: