అన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి కోసం ఆ ప్రయత్నం చేస్తున్న మహేష్.. దెబ్బకు ఫ్యాన్స్ ఖుషి..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పడం లో ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే రాజమౌళి తన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పెంచాడు. ఇకపోతే రాజమౌళి సినిమా అంటే హీరోలు కూడా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. రాజమౌళి సినిమాకు కమిట్ అయిన హీరోలు దాదాపుగా వేరే సినిమా వైపు కూడా పెద్దగా చూడరు.

ఎందుకు అంటే రాజమౌళి కూడా కేవలం ఒకే సినిమాపై పూర్తి ఫోకస్ పెడతాడు. అలాగే తన సినిమాల్లో హీరోలుగా నటించే వారు కూడా ఒకే సినిమాపై ఫోకస్ పెట్టేలా చూసుకుంటాడు. మరికొన్ని రోజుల్లో రాజమౌళి , మహేష్ హీరోగా ఓ మూవీ ని రూపొందించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ , రాజమౌళి సినిమా కోసం సరికొత్త లుక్ లోకి మారబోతున్నాడు. ఇప్పటికే పొడవాటి జుట్టును పెంచి , గుబురు గడ్డాన్ని కూడా పెంచుకున్నాడు.

ఇకపోతే మహేష్ బాబు చాలా సంవత్సరాల క్రితం అతిథి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ పొడవాటి జుట్టును పెంచాడు. ఆ సినిమా తర్వాత మహేష్ చాలా సినిమాలలో నటించిన ఏ మూవీ కోసం కూడా పొడవాటి జుట్టును పెంచలేదు. చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళి సినిమా కోసం మళ్లీ మహేష్ పొడవాటి జుట్టును పెంచాడు. ఇకపోతే ఈ సినిమా మొదలు కాకముందే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: