టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు
అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అనేక సినిమాలు కాబోతున్నాయి. అందులో చాలా మూవీలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడాయి. తాజాగా
ప్రభాస్ హీరోగా నటించిన మరో
సినిమా కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా
అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.
కొంత కాలం క్రితం
ప్రభాస్ ,
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ అనే
మాస్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
తమన్నా , దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా
అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాతో పాటు
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి.
ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం
మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని
అక్టోబర్ 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ హీరోగా రూపొందిన
డార్లింగ్ మూవీ ని
అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ హీరోగా నటించిన
ఈశ్వర్ మూవీని
అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది.