అల్లు అర్జున్ రికార్డుకు ఏసరు పెట్టిన తారక్.. దాన్ని కానీ కొడితే తారక్ కి తిరుగు లేనట్టే..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఈ మూవీ కేవలం 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 342 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టు లో ఈ మూవీ ప్రస్తుతం అద్భుతమైన స్థానంలో ఉంది. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 360 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి దేవర కంటే ముందు స్థానంలో ఉంది. ఇకపోతే ప్రస్తుతం దేవర సినిమాకి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ మరో కొన్ని రోజుల్లోనే పుష్ప పార్ట్ 1 టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ లో సాధించిన కలెక్షన్లను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పుష్ప పార్ట్ 1 లైఫ్ టైమ్ కలెక్షన్లను దేవర మూవీ దాటేస్తుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: