ss:కృష్ణుని గెటప్‌లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. 45 ఏళ్లు దాటిన అందంతో మత్తుల పోగొడుతుంది..!

Amruth kumar
పైన ఫోటోలో కృష్ణుని గెటప్ లో కనిపిస్తుంది ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్.. బుల్లితెర నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఆమె 17 సంవత్సరాలకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్‌ తెచ్చుకుంది. అయితే ఆమె సినిమా కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే ఒక‌ నటుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక్కడ నుంచి ఆమె సినీ కెరీర్ కు పెద్ద మైనస్ గా మారింది. ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది సినీ కెరియర్‌ను త్యాగం చేసి తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను ఎదుర్కొంది.

భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. కన్న కూతురు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక దీంతో మళ్లీ ఇప్పుడు ఆమెకు సినిమాలే జీవితమయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటుంది. మొదటి ఇన్నింగ్స్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా మారుమోగుతుంది. ఇప్పుడు ఈ అందాల హీరోయిన్ వయసు 45 ఏళ్లు పైనే.. అయినా అందం  అభినయం పరంగా కుర్ర హీరోయిన్లకు గట్టి షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎవరు అనేది అర్థమైపోయి ఉంటుంది.. ఇంతకీ అందాల హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజూ వారియర్.

మంజూ వారియర్‌ మనకు హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆమె మంచి రచయిత కూడా. ఇక ఆమెకు శాస్త్రీయ నృత్యంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో పలు సందర్భాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే స్టేజ్ షోలు చేసింది. పై ఫొటో అందులోదే. ఒక కార్యక్రమంలో భాగంగా కృష్ణుని గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఇక గాయనిగానూ టాలెంట్‌ను బయటపెట్టింది మంజు వారియర్. ‘తునివు’, ‘కాయట్టం’ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: