అర్జున్ సార్జా అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోనే.. ఈయన ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం, త్రిమూర్తులు,మన్నెంలో మొనగాడు వంటి తెలుగు సినిమాల్లో నటించడం వల్ల ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అలాగే నితిన్ హీరోగా చేసిన లై మూవీలో విలన్ పాత్రలో నటించారు. రామ్ పోతినేని నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే అలాంటి అర్జున్ సార్జా లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఆయన బామ్మ క్యారెక్టర్స్ చేసే ఆ హీరోయిన్ ని ప్రేమించారనే సంగతి మీకు తెలుసా.. అవును మీరు వినేది నిజమే.. బామ్మ క్యారెక్టర్స్ చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో సీరియల్స్, సినిమాలు అంటూ దూసుకుపోతున్న నటీ నళిని గాఢంగా ప్రేమించారట అర్జున్ సార్జా..అయితే అది వన్ సైడ్ లవ్వే.. హీరోయిన్ నళిని ఇప్పుడైతే బొద్దుగా తయారయ్యి బామ్మ పాత్రల్లో నటిస్తోంది కానీ ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయిన్..
ఆమె అందం అమాయకత్వానికి ఎంతోమంది దాసులయ్యారు. అలా అర్జున్ సార్జా కూడా నటి నళినీతో మూడు తమిళ సినిమాల్లో నటించే సమయంలో ప్రేమలో పడ్డారట. మొదటి సినిమా సమయంలో స్నేహంగా ఉన్న అర్జున్ రెండో సినిమా చేసేసరికి ప్రేమలో పడి పోయారట.కానీ ఈ ప్రేమ విషయం నళిని కి తెలియదు. ఇక మరో విచిత్రం ఏమిటంటే..నళిని ని అర్జున్ సార్జా ప్రేమిస్తే నళిని మాత్రం ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి రామరాజన్ తో అప్పటికే ప్రేమాయణం నడిపిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన అర్జున్ సార్జా తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా మనసులోనే దాచుకున్నారట.
ఇక నళినీ పెళ్లి జరిగిన సమయంలో అర్జున్ సార్జా నళినీల ప్రేమ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కానీ తన పెళ్లిని చెడగొట్టడం ఇష్టం లేక ఈ విషయాన్ని బయటికి ఎక్కువగా తెలియనియ్యలేదట. అలా అర్జున్ సార్జా ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే ఆదిలోనే అంతమైపోయింది. ఇక నళినీతో ప్రేమ బ్రేకప్ తర్వాత నటి నివేదిత రథసప్తమితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక హీరోయిన్ నళిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రామరాజన్ తో ఎక్కువ సంవత్సరాలు జీవించలేకపోయింది ఇద్దరికి గొడవలు రావడంతో మధ్యలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు.