చిరంజీవి : డ్యాన్స్‌లో తనకు తానే పోటీ.. ఆయనకెవరూ రారు సాటి..?
* కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి ఒకరు
* కెరీర్ ప్రారంభం నుంచి మంచి డ్యాన్సర్ గా గుర్తింపు
* ఏజ్ పై బడినా..కుర్ర హీరోలతో పోటీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొంతమంది... నటనలో దుమ్ము లేపితే... మరి కొంతమంది డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కొంతమంది కామెడీతో... సినిమాలు పండిస్తారు హీరోలు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం... డాన్స్ తో దుమ్ము లేపుతాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే కచ్చితంగా అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని ఇప్పటికి చెబుతూ ఉంటారు. ఆయన మొదటి నుంచి మంచి డాన్సరే.
ఇంద్ర లాంటి సినిమాలో... మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పు... ఇప్పటికే ఎవరు మర్చిపోలేదు. ఈ స్టెప్ నే వేరే సినిమాలలో కూడా చాలామంది వాడుతున్నారు. అంతేకాదు ఎవరు ఈ స్టెప్పు చేసిన... చిరంజీవి లాగా ఎవరూ చేయలేకపోయారు. అంతలా పాపులర్ అయింది మెగాస్టార్ చిరంజీవి డాన్స్. మెగాస్టార్ చిరంజీవి... ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారు. ఎవరి సహాయం లేకుండా కూడా... తన సొంత టాలెంట్ ను నమ్ముకున్నారు. అన్నం తినని రోజులు ఎన్నో గడిపారు.
పునాదిరాళ్లు సినిమాతో 1978లో... మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి... ఇప్పటివరకు... రాణిస్తూనే ఉన్నారు. తన కెరీర్లో అనేక రకాల మాస్, రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు... చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఏ సినిమా చేసినా కూడా.. మెగాస్టార్ డాన్స్ మాత్రం ఆ సినిమా హైలెట్ గా నిలుస్తుంది. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, త్రిష లాంటి స్టార్ హీరోయిన్ల సరసన కూడా.. డాన్స్ చేసి నేర్పించారు.
హీరోయిన్లను డామినేట్ చేసేలా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ఏ కాకుండా... కామెడీ టైం కూడా సూపర్. చిరంజీవి సినిమాలో... డాన్స్ తో పాటు కచ్చితంగా కామెడీ 100% ఉంటుంది. అలాగే ఎమోషన్స్... ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి. సెంటిమెంట్ డ్రామాలో కూడా మెగాస్టార్ చిరంజీవిని మించిన వారు ఎవరు లేరు.