టాలీవుడ్ స్టార్స్ ... స్పెషాలిటీ : సింగిల్ లైనర్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన మహేష్..?

Pulgam Srinivas
మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషల్గా ఉన్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లో కూడా ఒక సూపర్ టాలెంట్ ఉంది.

అది ఏమిటి అనుకుంటున్నారా ..? మహేష్ బాబు ఇతర హీరోలతో పోలిస్తే సింగిల్ లైనర్స్ డైలాగ్ లను చెప్పడంలో చాలా స్పెషల్. ఇప్పటి వరకు తాను ఎన్నో సినిమాలలో సింగిల్ లైన్ డైలాగ్ లను అద్భుతంగా చెప్పి ప్రేక్షకులను అదరగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో అనేక సింగిల్ లైనర్స్ డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మహేష్ బాబు అద్భుతమైన రీతిలో చెప్పాడు. చాలా వరకు ఆ సీన్స్ మహేష్ డైలాగ్ డెలివరీ వల్లే అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా కనిపిస్తూ ఉంటాయి.

అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమా కాకుండా మహేష్ బాబు "బిజినెస్ మాన్" అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ లో కూడా మహేష్ కోసం పూరి జగన్నాథ్ అనేక సింగిల్ లైనర్స్ రాశాడు. అందులో కూడా మహేష్ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మహేష్ నటించిన చాలా సినిమాలలో సింగిల్ లైనర్స్ డైలాగులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆయన అద్భుతంగా చెప్పి సినిమా విజయంలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఈయన తన స్పెషల్ టాలెంట్ తో ప్రేక్షకులను ఎన్నో సందర్భాలలో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: