రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
దర్శకధీరుడు రాజమౌళి తన మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో నే చేయడం జరిగింది.. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “స్టూడెంట్ నెం.1”..ఈ సినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్ తమ కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నారు.. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా ప్లాప్ అయింది.. అయితే ఆ సమయంలో రాజమౌళి అంత పాపులర్ కాకపోవడంతో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ అంత పాపులర్ కాలేదు.. రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేసారు. వీరి కాంబో లో వచ్చిన రెండో సినిమా “సింహాద్రి” ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది.. సింహాద్రి తరువాత ఎన్టీఆర్ చేసిన ‘ఆంధ్రవాలా’ ప్లాప్ అయింది.. ఆ తరువాత రాజమౌళి నితిన్ తో ‘సై’ సినిమా చేసాడు.. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. కానీ ఆ తరువాత నితిన్ నటించిన సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.. దీనితో రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో తర్వాతి సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని ఒక టాక్ ఏర్పడింది..

దీంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు అంతా అదే ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ rrr తర్వాత దేవరతో హిట్ కొట్టి రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడని అందరూ అంటున్నారు . ఆ సెంటిమెంట్ మొదలయింది కూడా ఎన్టీఆర్ తోనే. ఇన్నేళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ మళ్ళీ ఎన్టీఆర్ బ్రేక్ చేసాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ఇదే చెప్తూ ట్వీట్ వేయడం విశేషం.అయితే తాజాగా ఎన్టీఆర్ - కొరటాల శివ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేస్తున్నాం.. అంతే కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు..దీంతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: