మీడియం బడ్జెట్ సినిమాలకు బంగారు బాతు నాని
- ఇండస్ట్రీలో హీరోలంతా ఓకే లెక్క అయితే నాని మరో లెక్క
- నాచురల్ స్టార్ గా అద్భుత గుర్తింపు!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్నటువంటి చాలామంది హీరోలలో ఎక్కువమందికి సినీ బ్యాగ్రౌండ్ ఉంది. ఆ బ్యాగ్రౌండ్ తోనే వారు ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు. అలా అందరూ ఉన్నారని కాదు కొంతమంది హీరోలు సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్లుగా ఎదిగారు. అలా ఎదిగిన ఈతరం హీరోలలో నాని ముందు స్థానంలో ఉంటారు. అలాంటి నాని ఇండస్ట్రీలోకి హీరో అవుదామని రాలేదట. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చివరికి స్టార్ హీరోగా మారారు. నటన టాలెంట్ తో న్యాచురల్ స్టార్ గా ఎదిగారు. అలాంటి నాని సినిమాలు ఇతర వివరాలు చూద్దాం..
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి న్యాచురల్ స్టార్ గా:
ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకపోయినా తన టాలెంట్ ని, స్వయంకృషిని నమ్ముకుని మీడియం బడ్జెట్ సినిమాలకు బంగారు బాతుగా మారారు నాని. ఇంతకీ ఆ యువకుడు ఎవరయ్యా అంటే నవీన్ అలియాస్ నాని..మణిరత్నం సినిమాలంటే ఎంతో ఇష్టపడే నాని ఆయనలాగా డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా రాధాగోపాలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల, రాఘవేందర్రావు వంటి డైరెక్టర్ల వద్ద కూడా పనిచేశాడు. రేడియో జాకీగా నాన్ స్టాప్ నాని అనే ప్రోగ్రాం కూడా చేశారు. అలా ఇండస్ట్రీలో అష్టా చమ్మాలో హీరోగా స్వాతి కథానాయకగా వచ్చిన ఈ మూవీ అనుకోని హిట్ అయిపోయింది. అలా నాని వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత మరో హీరోతో కలిసి రైడ్ సినిమా చేశారు అది కూడా హిట్ అయింది. మూడవ సినిమా స్నేహితుడా ఫ్లాప్ అయింది. నాలుగో మూవీ భీమిలి కబడ్డీ జట్టు మోస్తారుగా రాణించిన నానికి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత అలా మొదలైంది చిత్రంలో హీరోగా చేసి తన టాలెంట్ ఏంటో అందరికీ చూపించాడు.