భారతీయుడి 3 పై తిరుగుబాటు మొదలైంది...!
భారతీయుడు 2 సినిమా సెట్స్ మీద ఉండగానే దీనికి పార్ట్-3 కూడా ప్రకటించి షూటింగ్ కూడా పూర్తి చేశారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే పెండింగ్లో ఉంది. భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక రెండు నెలల క్రితం భారతీయుడు 3 సినిమాను కూడా మార్కెట్లోకి తీసుకు రావాలనేది నిర్మాతల ప్లాన్. కానీ.. అనుకుంది ఒకటి, అయింది ఒకటి. భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో.. ఇప్పుడు భారతీయుడు 3 వస్తుంది కాబట్టి.. తమ నష్టాలను ఆ సినిమాతో భర్తీ చేస్తారని అందరూ ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ ఆశ లేకుండా పోయింది. భారతీయుడు 3 తెలుగు సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందట. వచ్చే ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాను డైరెక్టుగా స్ట్రీమింగ్ కు పెడతారని టాక్ నడుస్తుంది. అయిన కాడికి ఓటీటీకి అమ్ముకుని.. విడుదల చేస్తే భారతీయుడు 2 కొని చేతులు కాల్చుకున్న తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారతీయుడు 2 సినిమాకు ఏకంగా రూ.100 కోట్లకు పైగా నష్టం వచ్చింది. తెలుగులో ఈ సినిమాను ఏ అసియన్ .. సురేష్ ఎంటర్టైన్మెంట్, శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశాయి. తెలుగు సంగతి ఎలా ఉన్నా.. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే మరో పెద్ద వివాదం చెలరేగటం ఖాయం.