ఈ స్టార్ హీరోయిన్ అక్క ఏముంది రా బాబు.. అందంతో చెల్లినే డామినేట్ చేసింది గా..!

Amruth kumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్  గురించి కొత్త‌గా పరిచయం అవసరం లేదు .. పేరుకే హిందీ హీరోయిన్ అయినా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మామూలుగా లేదు . సీతారామంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన మృణాల్ ఆ తర్వాత హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ సినిమాల తో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు , హిందీ ఇండస్ట్రీలో వరుస‌ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగానే అందరికీ తెలుసు .. తన ఫ్యామిలీ విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ముఖ్యంగా మృణాల్ సినిమాల్లో అయినా బయట అయినా ఎంతో అందంగా కనిపించడానికి కారణం ఎవరు అంటే? మృణాల్ అక్క లోచన్ ఠాకూర్.  ఈమె మేకప్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలు పెట్టిన  ఇప్పుడు ఈమె మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ గా ఇండస్ట్రీలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మృణాల్‌ నటించిన అన్ని సినిమాలకు ఆమె పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా  లోచన్ ఠాకూర్ నే పని చేస్తూ వచ్చేది. టాలీవుడ్ లో మృనాల్ నటించిన‌ సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్‌ సినిమాలు కి కూడా లోచన్ వర్క్ చేసింది.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తన చెల్లిని అందంగా మేకప్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇలా కేవలం మృణాల్ కే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కూడా మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా మృణాల్ ఠాకూర్ తన అక్కకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె తన చెల్లిను మించిపోయే అందంతో కనిపించింది . దీంతో ఈమె కూడా హీరోయిన్ మెటీరియల్ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తూ ఆమె ఫోటో లను వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: