ఆ సీనియర్ హీరో భార్య, కూతురు.. బాలయ్యకు అంత ఇష్టమా..!
ఆయన భార్య కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. గతంలో హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె పేరు నిరోష.. రామ్‌కి, నిరోషా కలిసి సింధూరపువ్వు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సింధూరపువ్వు అంటూ వచ్చే పాట ఎంతో సూపర్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ ఆ పాటను వింటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిరోషా రామ్ కి ప్రేమలో పడ్డారు. అలాగే బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నిరోషా సినిమాలు చేసింది. ఈ క్రమంలో బాలయ్యకు జంటగా నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది.
అలాగే తెలుగులో ఈ ముద్దుగుమ్మ 30 సినిమాలకు పైగా నటించింది. అదేవిధంగా కోలీవుడ్ లో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. అక్కడ ఈమె దాదాపు 100 సినిమాలకు పైగా చేసింది. 1995 లో నిరోష రామ్‌కిని పెళ్లి చేసుకుంది. ఇక రామ్‌కీకి ఓ అన్న కూడా ఉన్నాడు. ఆయన మరి ఎవరో కాదు సీనియర్ హీరో శరత్ కుమార్. ఆయన కూతురు వరలక్ష్మీ రామ్‌కీకి వరసకు కూతురు అవుతుంది. రాధిక శరత్ కుమార్.. రామ్‌కీకు వదిన అవుతుంది. చాలా మందికి రామ్‌కీకి ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. రామ్‌కీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే నిరోషా కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా నిరోషా , వరలక్ష్మీ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించారు.