కొంతమంది నటీనటులు పెళ్లి వార్తలు ఎన్ని వినిపించిన వారి పెళ్లి జరగదు. అది కేవలం రూమర్ గానే మిగిలిపోతుంది.. అయితే ఈ సీనియర్ నటీమణుల మీద కూడా ఎన్నో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరో కాదు త్రిష,అనుష్క.. ఈ ఇద్దరు హీరోయిన్ల మీద పెళ్లి వార్తలు ఎన్ని చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు. అనుష్క గోల్డ్ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని, నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని, దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతుందని ఇలా పలు వార్తలు మీడియాలో చక్కలు కొట్టాయి. ఇక త్రిష విషయానికి వస్తే.. త్రిష హీరో విజయ్ ని పెళ్లి చేసుకోబోతోందని, ఈమె కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయని కొంతమంది ప్రచారం చేస్తుంటే, మరి కొంత మందేమో మలయాళ నిర్మాతని త్రిష ప్రేమిస్తుందని,ఆ నిర్మాత తోనే త్రిష పెళ్లి అని పుకార్లు పుట్టించారు.
ఇక తాజాగా త్రిష పెళ్లి పనులు షురూ అయ్యాయని, ఆమె తమిళనాడుకు చెందిన ఓ ఫేమస్ బిజినెస్ మాన్ తో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుంది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా త్రిష పెళ్లి వార్తలు మళ్లీ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది త్రిష అభిమానులు మా హీరోయిన్ కి ఎన్నిసార్లు పెళ్లి చేస్తార్రా నాయనా.. మీరెక్కడ దొరికార్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే తమిళనాడులో ఉండే ఓ ఫేమస్ బిజినెస్ మాన్ కి త్రిషకి మధ్య రిలేషన్ ఉందని, వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని, వీరు ఇద్దరు కలిసి ఓకే ఫ్లాట్ లో సహజీవనం చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే కొంతమంది తమిళ జనాలు త్రిష ఈ మధ్యకాలంలో ఓ మిస్టరీ మ్యాన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని, ఆ మిస్టరీ మ్యాన్ తమిళనాడులో ఓ పాపులర్ వ్యాపారవేత్త అని ఊహగానాలు వ్యాప్తి చేస్తున్నారు.. ఇక ఆ తమిళనాడుకు చెందిన బిజినెస్ మాన్ తోనే త్రిష పెళ్లి అని,ఇది ఫిక్స్ అంటూ వార్తలు రాసుకస్తున్నారు.మరి ఈ పెళ్లి వార్తలపై త్రిష ఎంత ఘాటుగా రియాక్ట్ అవుతుందో చూడాలి.ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఈ పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వైరల్ అయ్యే వార్తలపై ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి