బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Divya
టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడవ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శివశ్రీ రాయగురు తాజాగా రోడ్డు ప్రమాదం పాడిన పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగ్ కోసం వెళుతున్న ఇమే కారు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో ఈరోజు మధ్యాహ్న సమయంలో నాగార్జునసాగర్ వద్ద బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. అయితే ఈ బైక్ యాక్సిడెంట్ వల్ల బైక్ మీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

ఈ ప్రయాణంలో శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు మాత్రం చాలా దెబ్బతినిందని తెలుస్తోంది. బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తులు మాత్రం మద్యం సేవించి ఉన్నారని అందుకే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా మొదట భయభ్రాంతులకు గురైనప్పటికీ.. ఆ తర్వాత శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాయ లేదని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ కారు కూడా ప్రొడక్షన్ కంపెనీదే అని ఆమెది కాదని తెలుస్తోంది.

ఒక సాంగ్ నిమిత్తం శుభశ్రీ వెళుతున్నప్పుడు ఇలాంటి ప్రమాదం అనుకోకుండా జరిగినట్లు సమాచారం.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన ఆట తీరుతో మాట తీరుతూ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. టైటిల్ గెలవకపోయినా కూడా తన మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు రకాల టీవీ ప్రోగ్రామ్స్లో ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్గానే ఉంటున్న శుభశ్రీ తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. అందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: