టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడిగా మారిపోయాడు. ఇకపోతే ఈయన ఢీ , రెడీ , దూకుడు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల సరసన చేరిపోయాడు. ఇక దూకుడు మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. ఆఖరిగా ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన డీ మూవీ అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. మంచు విష్ణు ఈ మూవీ లో హీరో గా నటించగా ... జెనీలియా ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. శ్రీహరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కొంత కాలం క్రితం శ్రీను వైట్ల "డీ" మూవీ కి కొనసాగింపుగా డబల్ డోస్ అనే పేరుతో ఓ మూవీ ని అనౌన్స్ చేశాడు.
కానీ ఈ మూవీ స్టార్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేశాడు. డీ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో నటించాడు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించే నటుడి కోసం అనేక ఆప్షన్స్ వెతికాను. కానీ అంత పర్ఫెక్ట్ నటుడు దొరకలేదు. అందుకే ఆ సినిమాను ఆపివేశం అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.