అందాల ముద్దుగుమ్మ
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే
మూవీ తో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ
మూవీ తర్వాత ఈమెకు వరుసగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న
టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో భాగంగా ఈమె నటించిన అనేక సినిమాలు
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ
బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్
హీరోయిన్స్ స్థాయికి వెళ్లిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో నటించడం లేదు.
ఆఖరుగా ఈ
బ్యూటీ తెలుగు లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ
మూవీ విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలం అవుతున్న ఈ
సినిమా తర్వాత ఈ
బ్యూటీ ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం
తమిళ్ ,
హిందీ సినిమాలలో నటించడానికి
రకుల్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. తాజాగా ఈ
బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన కోసం ఓ
సినిమా క్లైమాక్స్ ని
మార్చి వేసినట్లు చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం
తమిళ్ , తెలుగు భాషల్లో 7/G బృందావన్ కాలనీ అనే
సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను
కన్నడ లో రీమిక్ చేశారు.
కన్నడ లో ఈ
మూవీ ని గిల్లి అనే టైటిల్ తో
రీమేక్ చేశారు. ఈ
మూవీ లో
రకుల్ హీరోయిన్ గా నటించింది. ఇది
రకుల్ ప్రీత్ సింగ్ కి తొలి సినిమా. ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా
రకుల్ మాట్లాడుతూ ... నాకు ఆ
సినిమా క్లైమాక్స్ నచ్చలేదు. చాలా ఎమోషనల్ గా ఆ
మూవీ క్లైమాక్స్ ఉంటుంది. దానితో నేను ఏడ్చేశాను. మా నాన్నకు
ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. అప్పుడు నువ్వు అలాంటి ఎమోషనల్ సీన్స్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పారు. అలాంటి సన్నివేశాలు చేయనని చెప్పడం వల్ల
కన్నడ క్లైమాక్స్ కొంత మార్చారు అని ఈ
బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.