పుష్ప కంటే ముందున్న గేమ్ చేంజర్.. ఈ అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..?

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలు రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. కానీ ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. చాలా కాలం క్రితం ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ మూవీ విడుదలకు మధ్యలో చాలా కాలం గ్యాప్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని చాలా మంది జనాలు నమ్మారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ బృందం ఈ మూవీ లోని ఐటెం సాంగ్ కూడా మరికొన్ని రోజుల్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించబోతున్నారు. శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. దానితో పుష్ప 2 కంటే కూడా గేమ్ చేంజర్ మూవీ యూనిట్ చాలా ముందంజలో ఉన్నట్లు చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: