ఎన్టీఆర్: కొడుకుల సినీ ఎంట్రీపై స్పందించిన యంగ్ టైగర్ ..!

FARMANULLA SHAIK
దేవర సక్సెస్ తో ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ..ఆ టాక్ కలెక్షన్లను ఏమాత్రం ఆపలేకపోయింది.డే 1 నుండి ఈరోజు వరకు కూడా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. దీంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ , శివ వరుస సక్సెస్ ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా విశేషాలతో పర్సనల్ విషయాలను కూడా ఎన్టీఆర్ షేర్ చేస్తూ వస్తున్నాడు.అయితే దేవర సినిమా విడుదలకు ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఎన్టీఆర్ అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ తన కొడుకులు అభయ్ భార్గవుల గురించి మాట్లాడారు.వాళ్లిద్దరి ఆలోచనా తీరులో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. భవిష్యత్తులో వాళ్లను సినీ పరిశ్రమలోకి తీసుకువస్తారా?
అని ప్రశ్నించగా తారక్‌ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నాకు నచ్చదు. అలా నేను చేయను.ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నేను కచ్చితంగా నమ్ముతాను. వారు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలి. ఇది చెయ్‌, అది చెయ్‌ అని అడ్డంకులు సృష్టించకూడదు. వాళ్లిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.
సినిమాల్లోకి అడుగుపెట్టు యాక్టింగ్‌లోనే రాణించాలి అని వాళ్లను బలవంతం చేయను. ఎందుకంటే నా తల్లి దండ్రులు నన్ను ఆవిధంగా ట్రీట్‌ చేయలేదు. ఏదో సాధించాలనుకుంటున్నాడు చేయని అని అనుకున్నారు. అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను కూడా గౌరవించాలనుకుంటున్నాను. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు.
తండ్రిని నటుడిగా చూసినప్పుడు, ఆ బాటలోనే అడుగులు వేయాలని తనయులు కూడా కోరుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వడలుగా మారాయి. అయితే ఎన్టీఆర్ చేసిన వాఖ్యల్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ను ఇన్స్పైర్గా తీసుకొని తన కొడుకులలో ఎవరో సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఎంట్రీ ఇస్తారని అనిపిస్తోంది.
ఇదిలావుండగా ఇదే ఇంటర్వ్యూలో 'దేవర: పార్ట్‌ 2' ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పందించారాయన. ''దేవర 1' చిత్రీకరణ సమయంలోనే పార్ట్‌2లోని కొన్ని సన్నివేశాలు పూర్తి చేశాం. తొలి భాగం విజయం సాధించడంతో మాపై బాధ్యత పెరిగింది. ఈ చిత్రం కంటే సీక్వెల్‌ ఇంకా బాగుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ సిద్ధమైంది. 'దేవర' కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఆయన్ని ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఆయన హాలీడే నుంచి తిరిగొచ్చాక రెండో భాగం పనులు ప్రారంభిస్తాం'' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: