"దేవర 2 " లో సూపర్ ట్విస్ట్.. ఆ స్కెలిటెన్ అతడిదే..లీక్ చేసిన కొరటాల..?
ఆచార్య తర్వాత కసిగా కొరటాల తెరకెక్కించిన మూవీ ఇది. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కొరటాల. రెండు పార్ట్‌లుగా రాబోతున్న ఈ సినిమాలో తొలి భాగంలో ఏం చూపించాలి, సెకండ్ పార్ట్ ఎలా ఉండాలన్న అంచనాతో కొరటాల స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ విషయాన్ని సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దేవర మొదలైనప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వు లేదని, టెన్షన్ పడుతూనే షూటింగ్ చేశాడని గుర్తుచేశారు. రీ రికార్డింగ్, డబ్బింగ్ సమయంలో భయపడుతున్న కొరటాలకు అనిరుధ్ ధైర్యం చెప్పి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నాడని.. అతను అన్నట్లుగానే దేవర ప్రభంజనం సృష్టించిందని తారక్ అన్నారు.
ఈ నేపథ్యంలో సెకంట్ పార్ట్‌పై ఉత్కంఠ కలిగించడానికి, హైప్ తీసుకురావడానికి కొరటాల కొన్ని ట్విస్ట్‌లు పెడతాడు. ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న అస్థిపంజరాలు ఎవరివి అన్న దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.తాజాగా స్టార్ యాంకర్ సుమ ఈ విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుమ అస్థిపంజరాల గురించే ప్రశ్నించింది. దీనిపై కొరటాల మాట్లాడుతూ.. చాలా అస్థిపంజరాలు ఉన్నాయని, ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యక్తిదని చెప్పారు. ఆ వ్యక్తిని సినిమాలో ఆల్రెడీలో చూశామా, లేక చూడబోతున్నామా అని సుమ ప్రశ్నించగా.. అన్ని చెబితే కుదరదని కొరటాల అంటాడు. మధ్యలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్‌వి కాదు.. మేం క్రిమినల్స్ కాదు అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.