ఆ సినిమా ప్లాప్ అంటే అస్సలు ఒప్పుకోను.. శ్రీను వైట్ల షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ డైరెక్టర్స్ లో ఈయన ఒకడు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత ఆ స్థాయిలో కామెడీ జానర్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత శ్రీను వైట్ల కి చెందుతుంది. అయితే ఈ క్రేజీ డైరెక్టర్ కి ‘దూకుడు’ తర్వాత ఆ స్థాయి హిట్ లేకపోవడం, ఈమధ్య చేసిన సినిమాలన్నీ డిజాస్టర్  అవ్వడంతో స్టార్ హీరోలు ఈయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా విశ్వంతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు శ్రీనువైట్ల. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా విశ్వం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బ్రూస్ లీ గురించి మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ “ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రూస్ లీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ కాదు, పెట్టిన బడ్జెట్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి లాభాలు బాగానే వచ్చాయి. కొన్ని మీడియా చానెల్స్ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినట్టు అసత్యాలను ప్రచారం చేసారు. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వకపోయినా మెగా అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ ని రీ లాంచ్ ఈ సినిమా ద్వారా చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ సినిమా ఎంట్రీ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చిరంజీవి గారికి ఈ సినిమా కోసం నేను చేయించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుతుంటారు. చిరంజీవి, రామ్ చరణ్ ని ఒకే స్క్రీన్ పైన చూసిన అభిమానులకు ఒక కనుల పండుగ ఈ చిత్రం. ఆయన వెండితెర పై కనిపించింది కాసేపే అయినా ఈ చిత్రం పై మంచి ప్రభావం చూపించింది . ఓపెనింగ్స్ కి కూడా ఆ సన్నివేశం బాగా ఉపయోగపడింది'' అని శ్రీను వైట్ల తెలిపారు.

తాజాగా శ్రీనువైట్ల ఇచ్చిన స్టేట్మెంట్ తో మెగా ఫ్యాన్స్ కూడా పాత లెక్కలు బయటకు తీస్తున్నారు. 'బ్రూస్లీ' ఓపెనింగ్స్ అప్పటి హిట్ సినిమాల కలక్షన్ల రేంజ్‌లోనే ఉన్నాయని, మరీ అంత తీసి పారేయాల్సిన సినిమా కాదని సంతృప్తి పడుతున్నారు. శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే మినిమం కామెడీ ఆ రోజుల్లో బ్రూస్లీలో లేకుండా పోయింది. ఇది అప్పటి రివ్యూలే తేల్చాయి. చిరు ఎంట్రీ సీన్‌, దాని కోసం తమన్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌… ఫ్యాన్స్ కి నచ్చాయి. చిరు ఎంట్రీ కూడా బలవంతంగా ఇరికించినట్టే ఉంటుంది. కాకపోతే చాలా కాలం తరవాత చిరంజీవిని ఆ లుక్ లో చూసేసరికి మెగా ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు. చిరు ఎంట్రీ కోసం థియేటర్లకు వెళ్లినవాళ్లు ఉన్నారు. అదే లేకపోతే… కచ్చితంగా 'బ్రూస్లీ'కి ఆ మాత్రం వసూళ్లు వచ్చేవి కావన్నది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: