రొమాన్స్ లో మునిగి తేలుతున్న వరుణ్ - సమంత..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ కాంబినేషన్లో  సిటాడేల్ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. దీనిని హనీ, బన్నీ గా డైరెక్టర్ రాజు అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్నది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ ను లండన్ లో ప్రదర్శించగా ఈవెంట్ కు సైతం సీటాడేల్ డయానా చిత్ర బృందం అందరూ కూడా హాజరయ్యారు. అలాగే నిర్మాత గినా గార్డి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నిర్మాత గినా గార్డి మాట్లాడుతూ.. తాను సీటాడేల్ ఇండియన్ వర్షన్  కూడా చూసానని వరుణ్ , సమంత కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ తో బాగా ఆకట్టుకుంటారని తెలిపారు. ముఖ్యంగా సీటాడేల్ బృందాన్ని కూడా కలవడం తనకి చాలా ఆనందాన్ని కలిగిస్తోందని.. ఇది గ్లోబల్ ఈవెంట్ అంటూ తెలిపారు. తాను దీన్ని ఇండియన్ వర్షన్ చూసి చాలా ఆశ్చర్యపోయానని కూడా వెల్లడించారు. మొదటి ఎపిసోడ్ అయితే మళ్లీమళ్లీ చూశాను ఇందులో సమంత, వరుణ్ నటన అద్భుతంగా ఉంది వీరిమధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అంటూ వీరి పాత్రలో ఊహించిన ట్విస్టులు ఉన్నాయని వెల్లడించారు.

అలాగే రాజ్ అండ్ డీకే అంటే తనకు చాలా ఇష్టమని వాళ్ల ప్రాజెక్టు అన్నీ కూడా చాలా భిన్నంగానే ఉంటాయని వెల్లడించారు. ఇలాంటి వారితో భాగమైనందుకు కూడా చాలా ఆనందంగా ఉందని తెలిపారు నిర్మాత గినా గార్డీ. ఈ వెబ్ సిరీస్ అందరి అంచనాలను మించి ఉంటుంది అంటూ తెలిపారు. ఇందులో సిమ్రాన్, సోహై మంజుధర్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గతంలో కూడా ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కూడా నెగటివ్ పాత్రలో నటించిన సమంత అద్భుతమైన నటనతో అదరగొట్టేసింది. ఇప్పుడు సీటాడేల్ కోసం మరొక ప్రత్యేకమైన పాత్రలో నటించి మరి మార్షల్ ఆర్ట్స్ ని కూడా నేర్చుకున్నదట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో స్క్రిమింగ్ కాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: