పవన్ కళ్యాణ్ పై అలంటి కామెంట్స్ చేసిన షాయాజీ షిండే..?

Suma Kallamadi
బుల్లితెర పై స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ 8 ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ క్రమంలో ప్రతి వారం ఎంతో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎపిసోడ్లో వైల్డ్ కార్డు ఎంట్రీ లోకి ఎనిమిది మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో హౌస్ లోకి ముందుగా హరితేజ ఎంట్రీ ఇవ్వగా హరితేజ కోసం నవదీప్ ఒక వీడియోను చేశాడు. అనంతరం టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. టేస్టీ తేజ కోసం శోభా శెట్టి వీడియో కాల్ చేసి మరి ఆల్ ద బెస్ట్ తెలియజేసింది. ఇక అనంతరం హౌస్ లోకి నాయిని పవని ఎంట్రీ ఇవ్వగా.. ఆమె కోసం శివాజీ ఒక ప్రత్యేక వీడియోను చేశాడు. అనంతరం మహబూబ్ దిల్ సే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇతని కోసం సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆల్ ద బెస్ట్ ను తెలియజేశారు.. అనంతరం హౌస్ లోకి రోహిణి, గౌతమ్, గంగవ్వ, అవినాష్ ఎంట్రీ ఇచ్చారు.


కేవలం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ మాత్రమే కాకుండా కొంత మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలో సుధీర్ బాబు, షాయాజీ షిండే బిగ్ బాస్ స్టేజి పై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వాస్తవానికి వీరు ఇద్దరూ బిగ్ బాస్ షో కు షోకు సెలబ్రిటీ గెస్ట్లుగా ఎందుకు వచ్చారన్న విషయానికి వస్తే.. "మా నాన్న సూపర్ హీరో" అనే సినిమా ప్రమోషన్లో భాగంగా అని అర్థమవుతుంది. ఇక ఈ స్టేజ్ పై షాయాజీ షిండేను హీరో సుధీర్ బాబు తెగ పొగిడేసాడు అంటే నమ్మండి.. షాయాజీ షిండే ఎక్కడైనా ఖాళీ స్థలాలు కనపడితే చాలు అక్కడ మొక్కలు నాటాడుతారు అన్నాడు.


ఇక ఈ విషయంపై షాయాజీ షిండే మాట్లాడుతూ.. నా దగ్గర డబ్బు ఉంది. కానీ., చివరకు మా అమ్మను బ్రతికించుకోలేకపోయాను. అప్పుడు నేను మా అమ్మ బరువుకు సమానమైన మొక్కల విత్తనాలు తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటాలని నిర్ణయం తీసుకున్నాను. అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తూ ఉంటే మా అమ్మ నాకు గుర్తు వస్తుంది అంటూ షాయాజీ షిండే తెలిపారు.. అంతేకాకుండా., మనం ఎక్కడైనా కానీ గుడికి వెళ్తే మనకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా ఇస్తే బాగుంటుందని నేను ఇప్పటికే ఈ ప్రక్రియను మహారాష్ట్రలోని మూడు ప్రధాన ఆలయాల్లో మొదలు పెట్టాలని తెలిపారు. ఇక్కడ కూడా ఇదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. ఈ ప్రక్రియ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరుకుతే అతని కలిసి ఈ వివరాలన్నీ తెలియజేస్తారని దేవుడి ప్రసాదంతో పాటు మొక్కలను కూడా పంచాలని తెలుపుతనన్నారు. అవి తర్వాతి తరాలకు మంచి చేస్తాయని షాయాజీ షిండే తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: