నందమూరి నట సింహం
బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరియర్లో చాలా
ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడు. ఇకపోతే బాలయ్యకు ఓ దర్శకుడు 2
ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. అలాంటి దర్శకుడితో
బాలయ్య ఓ
మూవీ ని మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఆ
సినిమా ఆగిపోయింది. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ
సినిమా ఎందుకు ఆగిపోయింది వివరాలను తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో బి.గోపాల్ ఒకరు. ఈయన
బాలకృష్ణ హీరోగా మొత్తం ఐదు సినిమాలను రూపొందించాడు.
అందులో లారీ
డ్రైవర్ ,
రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సమర
సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలు ఏకంగా
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబినేషన్లో ఐదవ సినిమాగా పలనాటి బ్రహ్మనాయుడు అనే
మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే వీరి కాంబో లో ఆరవ సినిమాగా హరహర మహాదేవ అనే
మూవీ స్టార్ట్ అయింది. కాకపోతే ఈ
సినిమా ఆ తర్వాత ఆగిపోయింది.
ఒక ఓ ఇంటర్వ్యూ లో ఈ
మూవీ దర్శకుడు అయినటువంటి
బి గోపాల్ మాట్లాడుతూ ... ఆ సినిమాను కథ లేకుండానే మొదలు పెట్టాం. ఆ తర్వాత కథ సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ సెట్ కాలేదు. చిన్ని
కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని కూడా విన్నాం. కానీ అది పెద్దగా నచ్చలేదు. అలా ఎంత ప్రయత్నం చేసినా ఆ సినిమాకు కథ దొరకపోవడంతో ఆ
మూవీ ని ఆపివేశం అని
బి గోపాల్ చెప్పుకొచ్చాడు.