ఎన్టీఆర్, సందీప్ వంగ కాంబోలో సినిమాపై సెన్సేషనల్ అప్డేట్..!?

Anilkumar
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఎలాగూ దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి, దేవరకి కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే దేవర టీమ్ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇంటర్వూస్ ఇస్తున్నాడు. కాగా ‘దేవర’ సినిమాలో అండర్ వాటర్ సీన్ల కోసం డ్రై ఫర్ వెట్ టెక్నిక్ వాడినట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇక ‘దేవర 2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరో రెండు నెలలు తర్వాత స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు  ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటుగా తెలుగులో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా ఆయన తొందర్లోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

బోల్డ్ సినిమాలను తీయడంలో సందీప్ రెడ్డి వంగా చాలా సిద్ధహస్తుడు. మరి ఎన్టీఆర్ తో కూడా అలాంటి ఒక బోల్డ్ మూవీ ని తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలపాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డి వంగా ఉన్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన కథను కూడా తను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: