నెలలు గడుస్తున్నా నో ఓటిటి.. హిట్ సినిమాకు ఇదెక్కడి పరిస్థితి..?

MADDIBOINA AJAY KUMAR
కొంత కాలం క్రితం తెలుగు ప్రేక్షకులు ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ను చూసేవారు కాదు. ఇక ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు పూర్తిగా మారాయి. థియేటర్లు చాలా కాలం పాటు మూతపట్టడం. టీవీ లలో కూడా కొత్త కంటెంట్ ఏది ప్రసారం కాకపోవడంతో ఓ టి టి కంటెంట్ వైపు జనాలు మాకు చూపడం మొదలు పెట్టారు. అలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి అలవాటు పడిపోయిన జనాలు ఇప్పటికి కూడా ఓ టీ టీ లో ప్రతి వారం ఏ కంటెంట్ వస్తుందా ..? అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

మూవీ మేకర్స్ కూడా సినిమా విడుదల అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఓ టీ టీ లోకి తమ మూవీలను తీసుకు వచ్చేస్తున్నారు. దాదాపు చాలా సినిమాలు విడుదల అయిన తర్వాత నెల తిరగకుండాకే ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఓ టీ టీ లోకి అస్సలు రావడం లేదు. ఇక ప్రేక్షకులు ఓ టీ టీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సినిమాలలో మనమే మూవీ ఒకటి. శర్వానంద్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ప్రతి శెట్టి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అయినా కూడా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి రావడం లేదు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ ఇప్పటికీ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంట్రీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: