గత కొద్ది రోజులుగా
కాంగ్రెస్ మహిళా
మంత్రి సురేఖ మాట్లాడిన మాటలు
మీడియా లో సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఇక కొండ
సురేఖ మాటలు మాత్రం దేశవ్యాప్తం గా ప్రకంపనలు రేపాయి. ఎంతో మంది సెలబ్రిటీలు
నాగార్జున కి
సమంత కి మద్దతు తెలిపారు. అలాగే
నాగార్జున కొండా
సురేఖ పై కోర్టు లో పరువు నష్టం దావా కూడా వేశారు. అలాగే
రేవంత్ రెడ్డి రివర్స్ అటాక్ చేసి
నాగార్జున పై ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమంగా కట్టడం పై కేసు కూడా పెట్టించారు. అలా వీరిద్దరి మధ్య కొద్ది రోజుల నుండి ఈ ఇష్యూ జరుగుతూనే ఉంది.ఈ నేపథ్యం లోనే
బిజెపి ఎంపీ రఘునందన్ రావు చేసిన మాటలు మరొకసారి మీడియాలో మంట పెట్టేసాయి. రఘునందన్ రావు బీఆర్ఎస్ మాజీ
మంత్రి తాజా
ఎమ్మెల్యే అయినటు వంటి
కేటీఆర్ సమంత గురించి ప్రస్తావిస్తూ మరొకసారి సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పటికే
కేటీఆర్ సమంతని ఎందుకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు అని అప్పట్లో మాట్లాడారు.అయితే తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయట పెట్టాలి అంటూ
మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.పది సంవత్సరాలపాటు బిఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఏం పని చేశారు. అలాగే అసలు చీర గురించి తెలియదు..
చేనేత గురించి అసస్లే తెలియని సమంతని
కేటీఆర్ ఎందుకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు వీరిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి..ఆ రంగుల లోకంతో ఉన్న సీక్రెట్ బంధం ఏంటో వాళ్ళిద్దరే బయట పెడితే బాగుంటుంది అంటూ రఘునందన్ రావు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో మరొకసారి
సమంత కేటీఆర్ ల ఇష్యూ తెరపైకి వచ్చింది.