ఆ టాలీవుడ్ సీనియర్ హీరో... ఎన్టీఆర్‌కు బావమరిది అవుతాడా.. !?

Amruth kumar
 టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ఇప్పటి వారికి పెద్దగా తెలియక పోవచ్చు కానీ 90 ల వారికి అసలు పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన వడ్డే నవీన్ .. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన పెళ్లి సినిమాతో స్టార్‌డం అందుకున్నాడు . ఆ సినిమా తర్వాత వెను తిరిగి చూసుకోకుండా వడ్డే నవీన్ ప్రేమించే మనసు, మనసుఇచ్చి చూడు , మా బాలాజీ  వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.

అయితే ఆయన నటించింది అతి తక్కువ సినిమాలే అయినా తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా వడ్డే నవీన్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఎటాక్ మూవీలో నటించాడు .. ఆ తర్వాత మరి ఏ సినిమాలను ఆయన కనిపించలేదు. ఆయన రీయంట్రీ ఇవ్వాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి వడ్డే నవీన్ సినిమాల విషయం పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వడ్డే నవీన్ కు టాలీవుడ్ స్టార్ హీరో వర‌స‌కు బావమరిది అవుతాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి చెందిన అమ్మాయిని ముందు పెళ్లి చేసుకున్నారట.

నందమూరి తారక రామారావు కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ మొదట వివాహం చేసుకున్నాడు . అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడ‌కులు తీసుకున్న‌రు. అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల కార‌ణంగా వడ్డె నవీన్ సినిమాలకు దూరమయ్యారని కూడా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వడ్డే నవీన్ రియల్ లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక్క‌ వెలుగు వెలిగిన ఈ హీరో రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: