విష్ణు కెరియర్ కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకున్న మోహన్ బాబు.. రిజల్ట్ కి అంత షాక్..?

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. మంచు విష్ణు కెరియర్లో మంచి విజయం సాధించిన సినిమాలలో డీ మూవీ ఒకటి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీహరి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ సినిమా మంచు విష్ణు కి రావడం కోసం మోహన్ బాబు చాలా పెద్ద పని చేసినట్లు తెలుస్తోంది. అసలు డీ సినిమా అవకాశం మంచు విష్ణు కు ఎలా వచ్చింది ..? అలా రావడం వెనక మోహన్ బాబు ఏం చేశాడు అనే దానిపై ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... శీను వైట్ల "డీ" మూవీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత దీనిని రవితేజ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న రవితేజ కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఆ తర్వాత అనుకోకుండా మోహన్ బాబు ఈ కథను విన్నాడట. దానితో మోహన్ బాబు , శ్రీను వైట్ల తో మంచు విష్ణు ఈ కథతో మూవీ చెయ్యి అన్నాడట. దానితో శ్రీను వైట్ల ఇప్పటికే రవితేజ కు ఈ కథను చెప్పాను సార్ ... ఆయన కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మీరే రవితేజను అడగండి. ఆయన ఓకే అంటే నేను విష్ణు తో ఆ కథతో సినిమా చేస్తాను అన్నారట. దానితో మోహన్ బాబు , రవితేజ ను సంప్రదించి విషయం చెప్పగా ఆయన ఒకే సారి చేసుకోండి అని చెప్పాడట. అలా శ్రీను వైట్ల , రవితేజ తో చేయాలి అనుకున్న సినిమా మోహన్ బాబు చొరవ తో మంచు విష్ణు తో చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: