ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలినా ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి అవకాశాలు కొట్టేయాలని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్.. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చేతి నిండా సినిమాలతో దూసుకుపోయింది.కానీ సడన్గా ఈమె కెరియర్ అతలాకుతలం అయిపోయింది.. ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది.ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బుట్ట బొమ్మ.. ఇక బుట్ట బొమ్మ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పూజ హెగ్డే మాత్రమే.. మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాపే..అలా బాలీవుడ్లో అవకాశం వచ్చినా కూడా బాలీవుడ్లో చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజ హెగ్డే కెరీర్ ఇరాకటంలో పడిపోయింది.
మరీ ముఖ్యంగా ఆ హీరో తో ప్రేమాయణం పూజ హెగ్డే కెరీర్ కి శాపంగా మారిందని కొంతమంది ఈమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే ఇద్దరు ప్రేమలో పడ్డారని,వీరిద్దరూ డేటింగ్ కూడా చేశారని బీ టౌన్ లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఎప్పుడైతే పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ప్రేమ వార్తలు వినిపించాయో అప్పటినుండి ఈమె కెరియర్ మొత్తం తారుమారైంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడ్డ ఏ హీరోయిన్ కైనా సరే కొన్ని కండిషన్లు పెడతారని,ఆ కండిషన్లకు ఒప్పుకుంటేనే వారితో ఉంటారనే టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది.
అలా పూజ హెగ్డే తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసిన సమయంలో కూడా పూజ హెగ్డే కి సల్మాన్ ఖాన్ ఎన్నో కండిషన్లు పెట్టారట.అంతేకాదు పూజ హెగ్డే దగ్గరికి వచ్చిన కొన్ని సినిమాలను కూడా సల్మాన్ ఖాన్ వద్దనడంతో రిజెక్ట్ చేసిందట.అలా సల్మాన్ ఖాన్ మాట వినడం వల్ల ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను పూజ హెగ్డే వదలేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చేద్దాం అన్న కూడా ఈమెకు అవకాశాలు ఇచ్చే వారు ఎవరూ లేకుండా పోయారు. అలా సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణమే పూజ హెగ్డే కెరీర్ కి శాపం గా మారిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది