నందమూరి అభిమానుల పండగ చేసుకునే వార్త.. తమ్ముడు కోసం అన్న వస్తున్నాడు గా..!

Amruth kumar
నటసింహం నందమూరి బాలకృష్ణ నట వరసడుగా మోక్షజ్ఞ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే క్రమంలో మోక్షజ్ఞకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటికి వచ్చింది. గతి కొన్ని సంవత్సరాలుగా బాలయ్య కొడుకుని హీరోగా చూడాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. త్వరలోనే వారి కాల నెరవేరబోతుంది. అయితే గతంలో మోక్షజ్ఞ చిత్ర పరిశ్రమడ‌లోకి రావాలని అసలు అనుకోలేదట .

ఆస‌లు అయ‌న అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేయాలని అనుకున్నాడట. అందుకే ఇన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు.  అంతే కాకుండా అన్న ఎన్టీఆర్ క్రేజ్ ను నేను అందుకోలేను అనే భయంతో కూడా మోక్షజ్ఞ వెనకడుగు వేశాడని కూడా అంటారు. ఎన్టీఆర్ ఎదిగిన తీరు మోక్షజ్ఞను భయపెట్టిందట.. హీరో అయితే ఎన్టీఆర్ రేంజ్ కు వెళ్లాలని కనీసం ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా రావాలని అనుకున్నట్టు తెలిసింది. అది అప్పట్లో అసాధ్యమని మోక్షజ్ఞ అనుకున్నాడట. ఎన్టీఆర్ లాగా సక్సెస్ అవ్వకపోతే తండ్రి బాల‌కృష్ణ కు  చెడ్డ పేరు వస్తుందని భావించాడట. అందుకే అప్పట్లో మోక్షజ్ఞ హీరోగా రానని తండ్రిని ఎదిరించారని వార్తలు కూడా వచ్చాయి.  

ఇక అప్పుడు మోక్షజ్ఞ హీరోగా వస్తున్న సినిమాతో తండ్రి బాలకృష్ణ, అన్న ఎన్టీఆర్ రేంజ్కి వెళ్లాలని భావిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను  కంప్లీట్ చేశాడు ప్రశాంత్ వ‌ర్మ‌. ఎన్టీఆర్ కూడా దేవర సక్సెస్ తో ప్రస్తుతం ఫుల్ ఖుషి గా ఉన్నాడు. ఇలాంటి క్రమంలో తమ్ముడు సినిమాలో అన్నయ్య కనిపిస్తే మాత్రం మోక్షజ్ఞ తోలి మూవీ మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాస్తాడు. మరి మోక్షజ్ఞ తన తొలి సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: