జన్మలో ఆ హీరోతో సినిమా చేను అంటున్న రాజమౌళి.. దీని వెనుక అసలు స్టోరీ ఇదే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో హీరోలు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆయన కొంత మందితో మాత్రమే సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి ఎన్టీఆర్, ప్రభాస్ నితిన్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి హీరోలతోనే సినిమాలు చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ ఓ స్టార్ హీరో మాత్రం అసలు రాజమౌళితో సినిమా చేను అంటే చేను అని భీష్ముంచుకుని కూర్చున్నాడుట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇంత‌కి ఆ స్టార్ హీరో మరి ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్.. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. ఈ మూవీ తర్వాత మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అదేవిధంగా రాజమౌళి తో మాత్రం సినిమా చేయాలనుకోవటం లేదు. వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం లేదని కూడా అంటున్నారు. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో రాజమౌళి , అల్లు అరవింద్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా చేశాడు. ఆ సినిమాకి అల్లు అరవింద్ అప్పటివరకు తన సంపాదించిన ఆస్తి మొత్తం పెట్టి రామ్ చరణ్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా హిటై భారీ కలెక్షన్లు కూడా అందుకుంది.
రాజమౌళి సినిమా సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ ప్రతిసారి సినిమా కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టానని మాటిమాటికి అనేవారని, చిరంజీవి కూడా కొన్ని ఇంటర్వ్యూలో తన కొడుకు ఎంతో కష్టపడి సినిమా లో న‌టించ‌డాని చెప్పారు. అల్లు అరవింద్ గురించి అసలు ఎవరు చెప్పకపోవడంతో ఆయన హార్ట్ అయ్యారట రాజమౌళికి ఇస్తానన్న షేర్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ మాట తప్పారట. దాంతో మగధీర మూవీ విజయానికి ఎవరు కారణం కాదని తను మాత్రమేనని రామ్ చరణ్ ని కాకపోతే ఒక ఈగని పెట్టి సినిమా తీస్తాను అని తర్వాత ఈగ సినిమా తో హిట్ కొట్టారు రాజమౌళి. అల్లు అరవింద్ తో గొడవలు కారణంగా ఆయనతో మళ్ళీ సినిమా చెయ్యకూడదనుకున్నారుట‌. దీన్నీ కార‌ణంగా జ‌క్క‌న‌, అల్లు అర్జున్ తో సినిమా చెయ్యరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: