ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండిస్తూ మహిళా మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆయన వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిపారు. ఈ విచారణలో నాగార్జున తరుపున న్యాయవాది కొండా సురేఖ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇక ఇరువురి న్యాయవాదులు మాట్లాడిన మాటలు న్యాయమూర్తి విని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. సమాజంలో ఎంతో బాగా బతికే తమ కుటుంబాన్ని బజారుకీడ్చి తమ కుటుంబం పరువు మొత్తం తీశారని కొండా సురేఖ మాట్లాడిన మాటలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం నాగార్జున వేసిన 100 కోట్ల పరువు నష్టం దావా గురించే మాట్లాడుకుంటున్నారు.ఒకవేళ ఆయన వేసిన 100 కోట్ల పరువు నష్టం దావా కి పాజిటివ్‌గా న్యాయమూర్తి స్పందిస్తే కొండా సురేఖ 100 కోట్లు ఇవ్వగలరా అని మాట్లాడుకుంటున్నారు .
ఇదంతా పక్కన పెడితే నాంపల్లి కోర్ట్ లో నాగార్జున తరపున న్యాయవాది అలాగే కొండా సురేఖ తరఫున న్యాయవాది ఇద్దరు ఎవరి వాదనలు వారు వినిపించారు. అయితే కోర్ట్ నుండి బయటికి వచ్చిన వెంటనే మీడియాతో సమావేశమైన కొండా సురేఖ న్యాయవాది నాగార్జునపై సంచలన కామెంట్లు చేశారు.కాంగ్రెస్ మహిళా మంత్రి నా క్లయింట్ అయినటువంటి కొండా సురేఖ చేసిన మాటల్లో ఎలాంటి తప్పులేదు. ఆమె కరెక్టే మాట్లాడింది. ఆమె మాట్లాడిన దాన్ని మీరే కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వల్లే నాగచైతన్య సమంతల కాపురం చెడిపోయింది. కేటీఆర్ సమంత ఫోన్ ట్యాప్ చేయడం వల్లే నాగచైతన్య,సమంత మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
దీని గురించే కొండా సురేఖ మాట్లాడుతూ మీ కొడుకు కోడలు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఈ విషయం అర్థం చేసుకొని ఒకసారి వెళ్లి నాగార్జున మాట్లాడాలి అంటూ కొండా సురేఖ మాట్లాడారు. ఆమె మాటల్లో ఎలాంటి తప్పు లేదు కదా.అయినా తాను మాట్లాడే మాటల్లో ఎలాంటి తప్పులేకపోయినా కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో విషయం సర్దుమనిగింది అని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున ఈ విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు.అసలు నాగార్జున పరువు నష్టం దావా ఎందుకు వేసారో కూడా అర్థం అవడం లేదు.. నాగార్జున తన కేసును వెనక్కి తీసుకోకపోతే ఆయనపై మేమందరం తిరుగుబాటు చేసి కేసులు పెడతాం.. అంటూ కొండా సురేఖ లాయర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.